ప్రతీ ఒక్కరూ ఒక మొక్క నాటాలీ వాటిని సంరక్షించుకోవాలి
పర్యావరణాన్ని కాపాడుదాం
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు గ్రోత్ సెంటర్ లో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అంసారియా మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మీద కోటి మొక్కలను నాటే బృహత్కర కార్యక్రమం జరిగిందని మన ప్రకాశం జిల్లాలో నాలుగు లక్షల మొక్కలను నాటుతున్నమని అన్నారు వచ్చే సంవత్సరం నాటికి మన జిల్లాలో 35 లక్షల మొక్కలను నాటటానికి కార్యాచరణ చేపట్టినట్లు తెలిపారు అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రతి ఒక్కరూ సింగల్ యూస్ ప్లాస్టిక్ ని విడనాడాలని అన్నారు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఒక్కో టీం తో ఒక్కో ప్రదేశంలో జరుపుకుంటున్నామని ఈ కార్యక్రమంలో ప్రజలకు సింగల్ యూస్ ప్లాస్టిక్ అనర్ధాలను ఎప్పటికప్పుడు వివరిస్తున్నారని అన్నారు ప్రజలు వీటివల్ల జరిగే అనర్ధాలను అర్థం చేసుకొని పర్యావరణానికి హాని కలిగించేటటువంటి ప్లాస్టిక్ ని నిషేధించి చేసంచులు వాడాలని అలానే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే అలవాటు చేసుకుని నాటిన మొక్కలకు నీరు పోసి వాటిని జాగ్రత్తగా సంరక్షించుకుంటే మనకు మన భావి తరాలకు మేలు జరుగుతుందని అన్నారు
What's Your Reaction?






