బాలికల బంగారు భవిష్యత్తుకు తొలి అడుగు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి శానంపూడి గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీ,మిట్టమీద పాలెం నుండి దాసరి ప్రణీత,
వెలిశాల లిఖిత,కంచర్ల అమృత వర్షిణి,దార్ల సంయుక్త మరియు కూతల ప్రదీప్తి ఐదు మంది బాలికలు ఐదవ తరగతిలోకి ప్రవేశం పొందారు.
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బాలికలకు తమ విద్యార్థి దశలో మొదటి పోటీ పరీక్షగా గురుకుల పాఠశాలలు నిలుస్తాయని, ప్రభుత్వ గురుకుల పాఠశాలలో క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటుగా సమతుల్యమైన పౌష్టికాహారం అందిస్తారని తెలియజేశారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో ఈ సంవత్సరం గురుకుల పాఠశాల బాలికలు రాష్ట్రస్థాయిలో ఉన్నత ప్రతిభను కనబరిచారన్నారు.
ఒక విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత స్థానం అధిరోహించాలంటే ఎంతో ఓపికతో విద్యపై దృష్టి నిలిపి, కఠోర సాధన చేస్తేనే సాధ్యమవుతుందన్నారు.
మొదటిగా నాలుగో తరగతి చదువుతున్న బాల బాలికలను గుర్తించి, వారి యొక్క తల్లిదండ్రులకు గురుకుల పాఠశాల యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించిన పిదప,పలు దపాలుగా బాల బాలికలకు విద్యాపరమైన ప్రోత్సహకాలు అందిస్తూ 5వ తరగతి ప్రవేశ పరీక్షకు సంబంధించిన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశామన్నారు.మధ్యలో వారి యొక్క విద్యా ప్రమాణ స్థాయిని పరీక్షిస్తూ ఉండటం పోటీ పరీక్షలో విజయానికి దోహదం చేసిందన్నారు.
ఈ విజయానికి సహకరించిన శానంపూడి ఉన్నత పాఠశాల అధ్యాపక సిబ్బందికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
What's Your Reaction?






