నిత్య పఠనం చేసేవారు ఫైళ్ళతో పనిచేవారు కంటి చూపు పట్ల అశ్రద్ధ చేయరాదు..సింగరాయకొండ కోర్టు న్యాయమూర్తి డా.వి. లీలా శ్యాంసుందరి పిలుపు

Feb 5, 2026 - 16:48
 0  27
1 / 1

పఠనం,కంటి చూపుతో    నిత్యం పని చేసే వారు కంటి చూపు పట్ల అశ్రద్ధ చేయవద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తరచూ కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలని సింగరాయకొండ కోర్టు న్యాయమూర్తి డా.వి.లీలా శ్యామ సుందరి పిలుపు ఇచ్చారు. గురువారం కోర్టు ప్రాంగణం లో సింగరాయకొండ బార్ అసోసియేషన్,  ఒంగోలు జిమ్ కంటి ఆసుపత్రి  సమన్వయం తో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ ఆరోగ్యం ఎంత ముఖ్యమో కంటి చూపు, పరీక్షలు అంతే ముఖ్యం అని ఆమె న్యాయవాదులు, కక్షిదారులు, ప్రజలకు హితవు చెప్పారు.ఇలాంటి ఉచిత వైద్య ఆరోగ్య సేవలు, పరీక్షలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సింగరాయకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ న్యాయవాదులు కక్షిదారులకు న్యాయ సేవలు అందించడం తో పాటు సామాజిక సేవలో కూడా చొరవ తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు, కక్షిదారులు, న్యాయవాదుల ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ తీసుకుని ఉత్తమ వైద్య పరీక్షలు శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇలాంటి వైద్య శిబిరాలలో ప్రాథమిక పరీక్షలు  చేయించుకుని అవసరమైన ఉత్తమ వైద్య పరీక్షలకు తగిన సిఫారసులు పొందాలన్నారు. ముందుగా న్యాయమూర్తి లీలా శ్యాంసుందరి కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ముందుగా ఆమె కంటి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమం లో జిమ్స్ డాక్టర్ నరసింహారావు,పి ఆర్ ఒ రమణ,సింగరాయకొండ బార్ అసోసియేషన్ న్యాయవాదులు,కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు, తేది. 5-2-2026.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0