సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో నూతన రోడ్డు నిర్మాణనికి శ్రీకారం చుట్టారు
ప్రకాశం జిల్లా , సింగరాయకొండ - పాకల రోడ్డు నుంచి కందుకూరు రోడ్డు వరకు గుంతలు ఏర్పడ్డాయి, నిత్యం ఈ మార్గంలో వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి, అడుగడుగునా గుంతలు పడి ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కొందరు మృతి చెందినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి పార్టీ నాయకులు మంత్రి దృస్టికి తీసుకొని వెళ్ళగా స్పందించి మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల రూపాయలు అనుమతులు ఇచ్చారు . గురువారం నాడు కూటమి నాయకులు భూమి పూజ చేసి రోడ్డు పనులు ప్రాంభించి ఆనందం వ్యక్తం చేశారు.
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0