పాకల బీచ్ ఫెస్టివల్ ఈ నెల 14, 15 తేదీల్లో ...జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు

Feb 5, 2026 - 16:31
 0  19
1 / 1

ప్రకాశం జిల్లా , సింగరాయకొండ మండలం ,  పాకల బీచ్ ఫెస్టివల్ ను  ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు అద్భుతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు. 
ఈ నెల 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు  పాకల బీచ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్న నేపధ్యంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన ఓబులేసు తో కలసి  పాకల బీచ్ ను సందర్శించి  బీచ్ ఫెస్టివల్ నిర్వహణలో భాగంగా చేపట్టవలసిన ఏర్పాట్లు పై  సంబంధిత అధికారులతో  సమావేశమై తగు  సూచనలు, ఆదేశాలు జారీ చేసారు.  జిల్లలో తొలిసారిగా  రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న పాకల బీచ్ ఫెస్టివల్ ను  అద్భుతంగా నిర్వహించేందుకు అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా పారిశుధ్య ఏర్పాట్లు, పార్కింగ్ నిర్వహణ, తాగునీటి వసతి,  బందోబస్తు ఏర్పాట్లు పై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సందర్శకులకు ఆహ్లాదం కలిగించేలా క్రీడలు, మౌలిక వసతులు కల్పించాలి. సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షోతోపాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ముందుగానే ఏర్పాట్లు చేయాలని,  స్థానిక వంటకాలతో కూడిన ప్రత్యేక ఫుడ్ కోర్టు లను  నిర్వహించాలి' అని సూచించారు. సందర్శకులకు ఇబ్బంది కలగకుండా రెండు రోజులు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేయాలని జిల్లా కలెక్టర్, ఆర్ టి సి అధికారులను ఆదేశించారు.  అవసరమైన మందులతో  వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు.  ముఖ్యంగా పారిశుధ్య ఏర్పాట్లు పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారికి సూచించారు.     పెద్ద సంఖ్యలో  సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకనుగుణంగా బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు.  
ఈ సమావేశంలో ఆర్ డి ఓ శ్రీమతి లక్ష్మీ ప్రసన్న, జిల్లా పరిషత్ సిఈఓ శ్రీ చిరంజీవి,  డిపిఓ శ్రీ వెంకటేశ్వర రావు, , విద్యుత్ శాఖ ఎస్ ఈ శ్రీ వెంకటేశ్వర రావు,   ఆర్టీసీ ఆర్ఎం శ్రీ సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. వెంకటేశ్వర రావు,  మత్స్య శాఖ జెడి శ్రీ శ్రీనివాస రావు, పర్యాటక శాఖ అధికారి  శ్రీమతి శ్రీరమ్య,   వివిధ శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0