పాకల బీచ్ ఫెస్టివల్స్ కు భారీ బందోబస్తు ప్రకాశం ఎస్పీ

Feb 12, 2026 - 04:29
 0  63

ఈనెల 14, 15 వ తారీకుల్లో ప్రకాశం జిల్లాలోని పాకల బీచ్ ఫెస్టివల్స్ జరగనున్న నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాట్లను బుధవారం నాడు ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ కు వచ్చే ద్విచక్ర వాహనాలకు ఒక పార్కింగ్ స్థలాన్ని , నాలుగు చక్రాల వాహనాలకు వేరొక చోట స్థలాన్ని కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలానే బీచ్ లో ప్రజల భద్రత దృశ్య 50 మంది గజ ఈతగాళ్లను నియమిస్తున్నట్లు ,అందరిని మెరైన్ పోలీసులు పర్యవేక్షించేలా ప్రణాళికలు చేస్తున్నట్లు అన్నారు. ప్రజలు ఎక్కడ శృతిమించకుండా వారి పరిధి దాటి ప్రవర్తించకుండా వివాదాలకు తావు లేకుండా అందరూ బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఈ యొక్క పాకల బీచ్ ఫెస్టివల్స్ ను విజయవంతం చేయాలని అన్నారు. వీరి వెంట ఒంగోలు డిఎస్పి ఆర్ శ్రీనివాసరావు, సింగరాయకొండ సిఐ హజరత్తయ్య , మెరైన్ సీఐ జి శివన్నారాయణ ,సింగరాయకొండ ఎస్సై బి మహేంద్ర, టంగుటూరి ఎస్సై శివనాగమల్లేశ్వరరావు ,జరుగుమల్లి ఎస్సై మహేంద్రా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0