కడప: ఈ ‘కోడి’ కోసం కోట్లు ఖర్చు చేస్తూ, 40 ఏళ్లుగా వెతుకుతున్నారు..

ఒక పక్షి కోసం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు దాదాపు 40 ఏళ్లుగా వెతుకుతున్నారు. దాని జాడ కనిపెట్టడానికి కెమెరా ట్రాప్స్ అమర్చి మరీ జల్లెడపడుతున్నారు. కనీసం ఆ పక్షి చేసే శబ్దాలనైనా రికార్డ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అరుదైన ఆ పక్షే కలివికోడి.
గోదావరి, పెన్నా నదీ పరివాహక లోయల్లో కనిపించే ఈ కలివికోడి 1900 నాటి నుంచి పెద్దగా కనిపించడం లేదని అటవీ అధికారులు చెబుతున్నారు.
1986 జనవరి తొలివారంలో ఐతన్న అనే స్థానికుడికి కలివికోడి దొరికిందని, దానిని ముంబయిలోని 'ది బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ'(The Bombay Natural History Society: BNHS)కి తీసుకెళ్తుండగా చనిపోయిందని అటవీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ చనిపోయిన పక్షిని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ మ్యూజియంలో ఉంచారు.ఆ తర్వాత, కలివికోడి మళ్లీ కనిపించిన దాఖలాల్లేవని అధికారులు చెప్తున్నారు. అయితే, వైఎస్ఆర్ జిల్లా (కడప జిల్లా) రెడ్డిపల్లి ప్రాంతంలోని చిట్టడవుల్లో ఈ పక్షిని చూశామని స్థానికులు కొందరు చెప్పారని, కానీ అధికారికంగా ఎలాంటి ఆధారాలు లేవని వారంటున్నారు.
What's Your Reaction?






