గిట్ల ఆడినవ్ ఏంది కాకా..!!
సన్ రైజర్స్ బ్యాటర్ల ప్రతాపానికి కోల్ కత బౌలర్లు చేతులెత్తేశారు. ఎలా బంతులు వేయాలో తెలియక తల పట్టుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అపార అనుభవం ఉన్న బౌలర్లు సైతం చేష్టలుడిగిపోయారీ మ్యాచ్ లో. ఎలా వేసినా కూడా ఆ బంతులన్నింటినీ బౌండరీ లైన్లు, ఫెన్సింగులు దాటించారు. ఎన్రిచ్ నోర్ట్జె, హర్షిత్ రాణా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, ఆండ్రీ రస్సెల్.. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బౌలర్లందరి ఎకానమీ 10కి పైగా నమోదైందంటే సన్ రైజర్స్ బ్యాటర్ల దూకుడు ఈ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేకించి- ఆండ్రీ రస్సెల్. రెండు ఓవర్లల్లోనే 34 పరుగులు ఇచ్చుకున్నాడీ ఆల్ రౌండర్. కోల్ కత బౌలర్లల్లో సునీల్ నరైన్- 2, వైభవ్ అరోరా ఒక వికెట్ తీసుకున్నారు.

What's Your Reaction?






