11వ తేదీన పొదిలిలో జరుగు రైతు పోరు బాటలో సింగరాయకొండ మండల నాయకులు రైతులు పాల్గొనాలి... వైసిపి మండలాధ్యక్షులు శ్రీ మసనం వెంకటరావు
10 గ్రామాల నాయకులతో మాట్లాడుతున్న మసనం వెంకట్రావు
ఈనెల 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతు పోరుబాటలో భాగంగా పొదిలికి రానున్నారని, ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరాయకొండ మండల అధ్యక్షుడు శ్రీ మసనం వెంకట్రావు సోమవారం సింగరాయకొండ మండల పరిధిలో ఉన్నటువంటి 10 గ్రామాల నాయకులు, పార్టీ అభిమానులు , రైతుల తోటి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. సింగరాయకొండ మండలంలో నుంచి పొదిలికి వెళ్ళటానికి అందరూ సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని 10 పంచాయితీల్లో ఉన్న నాయకులు జెడ్పిటిసిలు, ఎంపీటీసీలు, సర్పంచులు వార్డు మెంబర్లు కార్యకర్తలు చలో పొదిలి పోస్టర్ ను ఆవిష్కరించారు.
What's Your Reaction?






