కొండేపి లో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె విజయవంతం

Feb 12, 2026 - 12:39
Feb 12, 2026 - 12:39
 0  8

కొండేపి మండలంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గురువారం బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, పోస్టాఫీసులు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. లేబర్ కోడ్స్ రద్దు, కనీస వేతనం, ఉద్యోగ భద్రత వంటి డిమాండ్లతో జండా చెట్టు సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. 

ఆశా, అంగన్వాడీ, స్కీం వర్కర్లకు రూ.26,000 వేతనం, స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, పంటలకు మద్దతు ధర, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ వంటి డిమాండ్లు చేశారు. వివిధ కార్మిక, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0