జవహర నవోదయ విద్యాలయంలో నూతన వాటర్ పైప్ లైను ఒంగోలు పార్లమెంటు సభ్యులు ప్రారంభించారు
జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్దులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటామని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఒంగోలులోని జవహర నవోదయ విద్యాలయంలో 89లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ పైప్ లైనును ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, ఒంగోలు మేయర్ గంగాడ సుజాతలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్దులు ఎంతో కాలంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్య పరిష్కారానికి ఢిల్లీలోని జవహర్ నవోదయ విద్యాలయ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించడం జరిగిందన్నారు. 8నెలల కిందట ఒంగోలులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి ప్రత్యేకంగా నవోదయ విద్యాలయానికి పైప్ లైన్ నిర్మాణ పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ రోజు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. దీనితో నవోదయ విద్యార్దులకు నీటి సమస్య తీరుతుందన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి త్వరలో ఆర్.ఓ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, విద్యార్దుల సౌకర్యార్దం చేపట్టిన ఈ పథకం పనులను యద్ద ప్రాతిపదికన చేయడం జరిగిందన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటామన్నారు.
What's Your Reaction?






