సింగరాయకొండ శ్రీ చెట్టు మహాలక్షమ్మ దేవస్థానంలో ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా రాజశ్యామల అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం విశేష పూజా కార్యక్రమాలు

Feb 3, 2026 - 01:53
Feb 3, 2026 - 01:54
 0  16

KVS NEWS//ప్రకాశం జిల్లా : సింగరాయకొండ: ఓం శ్రీమాత్రే నమః రైల్వే రోడ్ సింగరాయకొండ శ్రీ చెట్టు మహాలక్ష్మి అమ్మ దేవస్థానంలో ఆదివారం మాఘ పౌర్ణమి సందర్భంగా రాజశ్యామల అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం విశేష పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు .   ఈ రాజ్యశ్యామల అమ్మవారి ఎవరు అలాగే అమ్మవారిని హోమము, అలాగే పూజ చేయడం ద్వారా మనకి వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే  రాజశ్యామలమ్మ గారు లలితా అమ్మవారి యొక్క ప్రధానమంత్రిగా అమ్మవారిని చెప్తారు. అలాంటి అమ్మవారి యొక్క హోమ కార్యక్రమం చేయడం ద్వారా ప్రజలందరికీ కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి దేశము, అలాగే మన గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి యొక్క యాగాన్ని నిర్వహించారు .  రాజశ్యామలమ్మ వారు మహా విద్యలలో దశమహావిద్యలు అంటారు.  ఆ దశమహావిద్యలలో 9వదిగా మనకి చెప్తారు. ప్రధానమంత్రిగా మనకి చెబుతున్నారు అలాగే ఆమెని ఆరాధన చేయడం ద్వారా హోమం చేయడం ద్వారా రాజ్య వైభవము అఖండ ధన సంప్రాప్తి వాక్ శుద్ధి ప్రసాదిస్తుంది.  అమ్మవారు అలాగే అమ్మవారి యొక్క మహిమ చేత చిన్న పిల్లలకి వాక్యాతుర్యము మంచి జ్ఞానం లభిస్తుంది. చిన్నపిల్లలకి అలాగే అమ్మవారి యొక్క హోమం చేసుకోవడం ద్వారా సంతానం లేని వారికి సంతానము శత్రువినాసనము అఖండ రాజయోగ ప్రాప్తి కలుగును నవరాత్రులు అంటే శ్యామల నవరాత్రుల్లో గనక అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే శాశ్వతమైనటువంటి ఫలితాలు మనకి కలుగుతాయి 

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0