కె.బిట్రగుంట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న కాల భైరవ స్వామి వారి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు
ప్రకాశం జిల్లా , కె.బిట్రగుంట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న కాల భైరవ స్వామి వారి దేవస్థానంలో .25-06-2025 బుధవారం జేష్ఠ బహుళ అమావాస్య పురస్కరించుకొని కాలభైరవ స్వామి వారి దేవస్థానంలో ఉదయం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు,108 శంకములకు పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులచే స్వయంగా శంకములతోటి స్వామివారికి సంఖభిషేకం కార్యక్రమం,ఈ సంధర్భముగా వివాహం కానివారు సంఖభిషేకం కార్యక్రమంలో పాల్గొని తమ దోషములు తొలగిపోవాలని కోరుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక అలంకరణ, అర్చన కార్యక్రమం నిర్వహించారు . అనంతరం 10 గంటల నుండి అఖండ అన్నదాన కార్యక్రమం లో భక్తులు పెద్ద సంక్య లో పాల్గొన్నారు .
What's Your Reaction?






