కొండపి P.H.C లో ఎక్సరే విభాగాన్ని ప్రారంభించిన మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి
దాతల సహకారంతో డెలివరీకి రూ.1000 చొప్పున ఆశా వర్కర్లకు ఇన్సెంటివ్ లు అందజేసిన మంత్రి డోలా
ప్రకాశం జిల్లా కొండపి ప్రభుత్వ హాస్పటల్లో మౌలిక వసతుల్లో భాగంగా 27 లక్షల రూపాయలు విలువ చేసే స్కానింగ్ సెంటర్ ని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు . ప్రభుత్వ హాస్పటల్లో కాన్పులు చేయించిన ఆశ వర్కర్లకి పారితోషకాలు అందించారు. కొండపి మండలం నేతివారిపాలెం గ్రామానికి చెందిన ఆశా వర్కర్ చింత రమాదేవికి నెల దేవతలు మూడు కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేపించినందుకు కాను ఒక్కొక్క కాన్పుకు వెయ్యి రూపాయలు లెక్కన మూడు వేల రూపాయలు పారితోషకాన్ని మంత్రి చేతుల మీదుగా ఆశా వర్కర్కు అందజేశారు ప్రభుత్వ ఆస్పటల్ లొ డెలివరీ కాన్పులు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ సిబ్బందికి పిలుపునిచ్చారు హాస్పటల్లో కాన్పులకు చేపించే ఆశ వర్కర్లకి ఏఎన్ఎం లకు పారితోషకాలు ఇస్తామని మంత్రి తెలిపారు.
What's Your Reaction?






