సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ
38 మంది లబ్ధిదారులకు రూ.28 లక్షల 30 వేల రూపాయల విలువైన సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ
పెద్దఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం సాయంత్రం టంగుటూరు మండలం, తూర్పునాయుడుపాలెం లోని తన క్యాంపు కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు రూ.28 లక్షల 30 వేల రూపాయల విలువైన సీఎం.ఆర్.ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో 1466 మంది లబ్దిదారులకు 11 కోట్ల 71 లక్షల రూపాయల మేర ఆర్దిక సహాయం అందించినట్టు తెలిపారు. ఆరోగ్య అవసరాల కోసం పేదలు ఆర్ధిక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పెద్ద మొత్తంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నిధులు మంజూరు చేస్తూ పేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారన్నారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0