పొగాకు రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని రోడ్డుపై నిరసన..
ప్రకాశం జిల్లా.. కొండేపిలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ గురువారం నాడు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేశారు. పొగాకు మాడు చెక్కలని పేరు పెట్టి కొనడం లేదని ఆరు క్లస్టర్లు పూర్తయిన కొనకుండా వివిధ పేర్లు పెట్టి సాకులు చూపడం తప్ప ప్రభుత్వం కొనుగోలుదారులతో సంప్రదింపులు చేసి వెంటనే ప్రారంభించాలని కోరారు. గిట్టుబాటు ధర కల్పించకపోతే తమకు మరణమే శరణమని రోడ్డుపై బైఠాయించారు దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సద్దుపాటు చర్య చేశారు. ఇకనైనా ప్రభుత్వం నిద్రలేచి రైతులను ఆదుకొని గిట్టుబాటు ధర కల్పించి రైతులకు ప్రాణం పోయాలని ఆవేదన వ్యక్తం చేశారు.
What's Your Reaction?






