ప్రకాశం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా
ప్రకాశం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఒంగోలులోని పోలీసు కవాతు మైదానం నుంచి అద్దంకి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం డ్రగ్స్ రహిత జిల్లాగా చేస్తామని ప్రతిజ్క్ష చేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్.విజయకుమార్, జిల్లా ఎస్పీ ఏ.ఆర్.దామోదర్, పట్టనంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్దులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని అలాగే, మనం కూడా మన జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా చేయాలన్నారు. ఇప్పటికే నవోదం కింద జిల్లాను నాటు సారా రహిత జిల్లాగా ప్రకటించడం జరిగిందన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా ఈగల్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, కళాశాల్లో డ్రగ్స్ నియంత్రణకు ప్రత్యేకంగా 30 సభ్యులతో ఈగిల్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
What's Your Reaction?






