ఇండో సోలార్ వద్దు పొలం ముద్దు అంటూ కరేడు గ్రామస్తులు నిరసన
ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామ పరిధిలో ఇండో సోలార్ కోసం ఇటీవల నోటిఫికేషన్ జారీ అవ్వడంతో అధికారులు భూసేకరణ కోసం రానున్న నేపథ్యంలో ఆదివారం నాడు కరేడు గ్రామస్తులు ఇండో సోలార్ వద్దు పొలం ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకొని నేషనల్ హైవే ను దిగ్భంగం చేశారు. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామ చైతన్య యాదవ్ వీరికి మద్దతుగా నిలిచారు ప్రజలతో మమేకమై నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు . ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పెద్ద సంఖ్యలో పోలీస్ బలగాలు అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ పూజ మాట్లాడుతూ జులై 4వ తేదీన గ్రామసభ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామ ప్రజలు, భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామ చైతన్య యాదవ్ తమ నిరసనను విరమించారు.
What's Your Reaction?






