పాకాల, ఊళ్ళపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది
సింగరాయకొండ మండలంలోని పాకల మరియు ఉల్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమం నందు మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రరావు గారు మాట్లాడుతూ. అన్నదాత సుఖీభవ పథకానికి గ్రీవెన్స్ అప్లికేషన్ కొరకు 23 తేదీ వరకు అవకాశం కల్పించారని, స్థానిక రైతు సేవా కేంద్రాలలోని గ్రామ వ్యవసాయ సహాయకుల ద్వారా. రైతు వివరాలు అర్హుల జాబితాలో సరిచూసుకొని లేని పక్షంలో గ్రీవెన్స్ పెట్టవలసిందిగా రైతు సోదరులకు తెలియజేశారు. అదేవిధంగా వరి పంటలో ఎరువులు యాజమాన్యం మరియు సస్యరక్షణ చర్యల గురించి రైతు సోదరులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి షేక్ జహీర్. గ్రామ వ్యవసాయ సహాయకులు ఎం అరుణ్ చంద్, ఎం భవాని మరియు సిహెచ్ శారద, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వెంకటరమణ, గ్రామ నాయకులు మరియు రైతు సోదరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






