కామేపల్లి లోని వైభవముగా పోలేరమ్మ అమ్మవారి తిరునాల
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి గ్రామములొ కొలువు తీరి ఉన్న పోలేరమ్మ అమ్మవారు భక్తులకు కొంగు బంగారముగా విరాజిల్లు తున్నది. సుదూర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు పోలేరమ్మ తల్లిని దర్శించుకొని తమ కోరికలను కోరుకొంటుంటారు, అలానే ఆ తల్లి కోరిన కోరికలు తీరుస్తూ భక్తులకు కొంగు బంగారముగా నిలిచింది పోలేరమ్మ తల్లి. పోలేరమ్మ అమ్మవారి తిరుణాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకఅలంకరణ నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు తెలిపారు. ఈ మూడు రోజులు అమ్మవారు రోజుకు ఒక వేషధారణలో భక్తులకు దర్శనం ఇస్తారని అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారని వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాటు చేశామని ఆలయ ఈవో బైరాగి చౌదరితెలిపారు. ఈరోజు రేపు పలు సాంస్కృతి కార్యక్రమాలు ఉంటాయని ఎల్లుండి విద్యుత్ ప్రభలతో అమ్మవారి తిరుణాల కన్నులు పండుగ జరుగుతుందని ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకుని తిరుణాలలో పాల్గొనాలని ఆలయ ఓ బైరాగి చౌదరి పిలుపునిచ్చారు.
What's Your Reaction?






