పాకల సముద్ర తీరంలో 15 లక్షల రూపాయల వ్యయంతో బేవాచ్ టవర్

బేవాచ్ టవర్ ను ప్రారంభిస్తున్న కలెక్టర్ తమీమ్ అంసారియా, ఎస్పీ AR దామోదర్, మంత్రి స్వామి

Jun 16, 2025 - 10:54
 0  7
పాకల సముద్ర తీరంలో 15 లక్షల రూపాయల వ్యయంతో బేవాచ్ టవర్
పాకల సముద్ర తీరంలో 15 లక్షల రూపాయల వ్యయంతో బేవాచ్ టవర్

పాకల సముద్ర తీరానికి ఆహ్లాదం కోసం కుటుంబ సభ్యులతో కలిసి నిత్యం సుదూర ప్రాంతాల నుంచి వస్తు మృత్యువాత పడుతున్న తీరు మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి మనసు కలత చెందింది ఇటీవల సముద్రంలో జరుగుతున్న వరుస మరణాలు మంత్రి స్వామి ఆకల గ్రామానికి వచ్చినప్పుడు ఒక కురవగానే మిగిలింది తన ఆలోచనకు పదును పెట్టి అధికారులకు దిశా నిర్దేశం చేసి ఈ ప్రాంతంలో ఎవరు విహారానికి వచ్చి ఇబ్బందులు పడకూడదని సురక్షితంగా ఇంటికి వెళ్లేలా ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు అధికారుల సమిష్టి కృషితో సుమారు 15 లక్షల రూపాయల వ్యయంతో బేవాచ్ టవర్ ను రూపకల్పన చేశారు ఈ టవర్కు ఆధునిక సాంకేతికతను జోడించి ప్రజల కదలికలను అనునిత్యం రికార్డు చేయటానికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు దీనితోపాటు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం టైం క్లాక్ అనౌన్సింగ్ సిస్టం ను ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాట్లను సింగరాయకొండ ci, si లకు దగ్గరుండి చూసారు.  ప్రత్యేక ఆకర్షణగా ఎత్తులో ఎగురుతున్న మువ్వన్నెల జెండా, సింహతలాట నిలిచాయి.  ఈ కార్యక్రమంలో Rdo లక్ష్మీ ప్రసన్న, ఏ ఆర్ Dsp శ్రీనివాసరావు, కోస్ట్రల్ సెక్యురిటి ci శివన్నారాయన, ri రమణారెడ్డి, సీతా రామిరెడ్డి, టంగుటూరు si శివ నాగ మల్లేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0