రూడ్ సెట్ సంస్థ లో మహిళలకు కార్ డ్రైవింగ్ నందు ఉచిత శిక్షణ
రూడ్ సెట్ సంస్థ లో మహిళలకు కార్ డ్రైవింగ్ నందు ఉచిత శిక్షణ: ఒంగోలు రూడ్ సెట్ సంస్థ లో 20.06.2025 తేదీ నుంచి 30 రోజుల పాటు కార్ డ్రైవింగ్ నందు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ పి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ శిక్షణకు ఉమ్మడి ఒంగోలు జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెంది ఉండి ఆధార్ కార్డ్, రేషన్ కార్డు మరియు ఎల్ ఎల్ ఆర్ కలిగి ఉండవలెను. శిక్షణ కాలం లో భోజనం మరియు వసతి ఉచితంగా కల్పించబడునని తెలిపారు మరిన్ని వివరాలకు మరియు నమోదు కొరకు ఈ క్రింది నంబర్ ను సంప్రదించవచ్చు 9573363141 అని అన్నారు.
What's Your Reaction?






