విద్యార్థులకు క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ అనూష..
కొండేపి మండలంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ అనూష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, జీవనశైలి మరియు ఆహార అలవాట్ల వల్ల కలిగే ప్రమాదాలు, పొగాకు, మద్యం, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటి వల్ల వచ్చే దుష్పరిణామాలపై వివరించారు. క్యాన్సర్ వచ్చిన వారు పోషకాహారం, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు. క్యాన్సర్ రాకుండా నివారించేందుకు క్రమబద్ధమైన జీవనశైలి, వ్యాయామం, పరిశుభ్రత, ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. శరీరంలో అకస్మాత్తుగా వచ్చే గడ్డలు, బరువు తగ్గడం, దీర్ఘకాల నొప్పులు, రక్తస్రావం వంటి లక్షణాలను గమనించి వెంటనే వైద్యులను సంప్రదించాలని విద్యార్థులకు సూచించారు. ఈ అవగాహన సదస్సు విద్యార్థుల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించిందని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0