పుట్టినరోజు సందర్భంగా పలకలు పంపిణీ
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ, గౌదగట్ల వారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు సోమరాజు పల్లి కి చెందిన వల్లెపు మాల్యాద్రి - సుకన్య దంపతుల కుమారుడు వీర గణేష్వక్ పుట్టినరోజు సందర్భంగా పాఠశాల చిన్నారులందరికీ పలకలు, నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు,మిఠాయిలు పంచి పెట్టినారు.ఈ సందర్భంగా స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ పాఠశాలల్లో చిన్నారుల ప్రత్యేకమైనటువంటి దినోత్సవాలు జరుపుకోవడం వలన సాంఘిక,మానసిక భావోద్వేగాలు అభివృద్ధి చక్కగా జరుగుతుందని, చిన్నతనం నుండే ఇతరులకు సహాయం చేయడం, కలిసిమెలిసి జీవించటం, పెద్దలను గౌరవించడం వంటి మంచి గుణాలు పిల్లల్లో పెంపొందుతాయని, మాల్యాద్రి - సుకన్య దంపతులు సామాజిక బాధ్యతగా పేద పిల్లలకు నోటు పుస్తకాలు, పలకలు అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అజయ్ చౌదరి,అనురాధ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
What's Your Reaction?






