పాఠశాల అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ,గవదగట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు సింగరాయకొండ కు చెందిన నక్కన వెంకట సుబ్బారెడ్డి (వెటర్నరీ అసిస్టెంట్) తన ప్రతి పుట్టినరోజు సందర్బంగా పాఠశాల విద్యార్థులకు 5000₹ విలువైన శ్రవణ ఉపకరణం బహూకరించి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్థానిక మండల విద్యాశాఖ అధికారి-2 ఆవుల శ్రీనివాసరావు మాట్లాడుతూ 0 నుండి 18 సంవత్సరాల పిల్లలందరూ పాఠశాలలో చదువుకోవాలని కలెక్టర్ గారు బంగారు బాల్యం అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని పిల్లల యొక్క అవసరాలను గుర్తించి వారికి మంచి భవిష్యత్తును అందించాలంటే పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలలో ఉండాలని సూచించారు. స్థానిక వెటర్నరీ డాక్టర్ వడ్లమూడి హజరత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని పెద్దవారైన తర్వాత వారు కూడా సమాజ శ్రేయస్సుకు తోడ్పాటు అందించాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు, ఉపాధ్యాయులు అజయ్ చౌదరి,ప్రముఖ న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు, వెటర్నరీ అసిస్టెంట్లు చల్లా సురేంద్ర, నూకసాని శ్రీనివాసులు పాల్గొన్నారు.
What's Your Reaction?






