పేద వాడి ఆకలి తీర్చే అన్న కాంటెన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి, కలెక్టర్

Jun 27, 2025 - 11:18
Jun 27, 2025 - 11:21
 0  4
పేద వాడి ఆకలి తీర్చే అన్న కాంటెన్ కు శంకుస్థాపన చేసిన మంత్రి, కలెక్టర్

కొండపి నియోజకవర్గం, సింగరాయకొండలో 61 లక్షల రూపాయలతో నిర్మించనున్న అన్నా క్యాంటిన్ నూతన భవన నిర్మాణానికి శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా తో కలసి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి శంఖుస్థాపన గావించి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. 2014-19 లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నా క్యాంటిన్ల ను ప్రారంభించగా, గత ప్రభుత్వం వాటిని మూసివేయడం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం అన్న క్యాంటీన్ల ను తిరిగి ప్రారంభించి రూ.5 కే పేదల ఆకలి తీర్చుతున్నామన్నారు. అలాగే దివ్యాంగులు, వృద్దుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటి వద్దకే రేషన్ అందచేయడం జరుగుచున్నదన్నారు. కుటుంబంలో ఎంత మంది పిల్లలు వున్నా తల్లికి వందనం ఇస్తున్నామని, దీపం పధకం 2 ను, పించన్ల పెంపు వంటి కార్యక్రమాలను అమలు చేస్తూ పేదల సంక్షేమ ప్రభుత్వంగా పనిచేస్తున్నదన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పనిలో నాణ్యత, పారదర్సకతతో పనిచేస్తున్నదని, అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును ప్రజల నుండి ప్రజాస్పందన తీసుకుని సంక్షేమం, అభివృద్దిని ముందుకు తీసుకెళ్లడం జరుగుచున్నదన్నారు. ఈ రోజు సింగరాయకొండలో శంఖుస్థాపన చేసుకున్న అన్నా క్యాంటిన్ ను అక్టోబర్ 2 నాటికి పూర్తీ చేసి ప్రారంభించుకునేలా నిర్మాణ పనులను పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఒక్క మెసేజ్ తో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని, ఇది మంచి ప్రభుత్వం, ప్రజల మన్నలు పొందుతున్న ప్రభుత్వం అని అన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా మాట్లాడుతూ, ఈ రోజు సింగరాయకొండలో 61 లక్షలతో నిర్మించుకుంటున్న అన్నా క్యాంటిన్ నిర్మాణానికి కృషి చేసిన మంత్రివర్యులు డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రానున్న మూడు నెలల్లో ఈ అన్నా క్యాంటిన్ నిర్మాణం పూర్తీ అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ అన్నా క్యాంటిన్ ఏర్పాటు వలన ఈ ప్రాంత పేద ప్రజలకు ఎంతగానో ఉపయోగంగా ఉంటుందన్నారు. అనంతరం ఎస్.సి బాలుర వసతి గృహాన్ని సందర్శించి జరుగుచున్న ఆధునీకరణ పనులను మంత్రివర్యులు డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారియా తో కలసి పరిశీలించారు. ఆధునీకరణ పనులు త్వరితగతిన, నాణ్యతతో పనులను పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Files

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0