జరుగుమల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, మ్యారిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య
ప్రకాశంజిల్లా , జరుగుమల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి స్వామి, ఎంపీ మాగుంట, మ్యారిటైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సంధర్భముగా వీరు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి ఆలోచన ప్రజల కోసమే అని వైసీపీ పాలనలో దెబ్బతిన్న రాష్టాన్ని ఏడాదిలోనే గాడిన పెట్టాం అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు అని తెలిపారు. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తూ, మరో వైపు పరిశ్రమలు పెట్టుబడులు తెచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిస్తున్నాం అని అన్నారు. మరో వైపు అమరావతి, పోలవరం పనులు చక చక జరుగుతున్నాయని అన్నారు. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తున్నాం ... జగన్ గత 5 ఏళ్ళ పాలనలో జగన్ చేసిన ఒకే ఒక్క పని ప్రజలను మోసం చేయడం అని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
What's Your Reaction?






