తూర్పు నాయుడుపాలెంలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సిఎం.ఆర్. ఎఫ్ చెక్కులు పంపిణీ చెసిన మంత్రి డా.స్వామి

Aug 11, 2025 - 10:51
 0  16

రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్దిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీ.నారా చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మాత్యులు డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి చెప్పారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సి.ఎం.ఆర్.ఎఫ్) నుంచి చేస్తున్న సహాయమే దీనికి నిదర్శనమని ఆయన అన్నారు. సోమవారం టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన నివాసంలో 36 మంది లబ్ధిదారులకు రూ.27.73  లక్షల విలువైన  సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటికి వడ్డీలు చెల్లించడం తమ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉన్నప్పటికీ వైద్యం కోసం ఖర్చు చేసుకున్న ప్రజలకు సహాయం చేయటానికి ఎల్లవేళలా ముందు ఉంటున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కొండపి నియోజకవర్గంలో రూ.4.67 కోట్ల ఆర్థిక సహాయం  అందించామన్నారు. మరోవైపు వైద్య రంగాన్ని బలోపేతం చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి చెప్పారు. ప్రభుత్వాసుపత్రులలో సిబ్బందిని నియమించి సౌకర్యాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. గుండెపోటు వచ్చిన వెంటనే స్టెమీ ద్వారా మారుమూల ప్రాంతాల్లోనూ ప్రజల ప్రాణాలను కాపాడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే ప్రతి పౌరుని ఆరోగ్య వివరాలను డిజిటలై జేషన్ చేయబోతున్నామన్నారు. దీనికి బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0