గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు మెగా వైద్య శిబిరంలో పాల్గొన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి
పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి అన్నారు. సఫాయి మిత్ర సురక్ష సివిర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాస్థాయిలో ఒంగోలులో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సంధర్భముగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెలా నాలుగో శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య పరీక్ష నిర్వహణకు చర్యలు చేపడుతామని అన్నారు. మున్సిపల్ కార్మికులతో సమానంగా పంచాయతీల్లోని పారిశుధ్య కార్మికులకు కూడా 10 లక్షల బీమా సదుపాయం కల్పించడంపై దృష్టి పెడతామని అన్నారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల విధుల నిర్వహణకు అవసరమైన యూనిఫారం, వ్యక్తిగత భద్రత పరికరాలతో కూడిన పీ.పీ.ఈ. కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే శ్రీ.బి.ఎన్. విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






