జగన్ అంటే నమ్మకం - బాబు అంటే మోసం పుస్తకం ఆవిష్కరించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్
అన్నీ అమలు చేశామని చెప్పటం విడ్డూరం
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ లో గురువారం నాడు మాజీ మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కొండేపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమూలపు సురేష్ "జగన్ అంటే నమ్మకం - బాబు అంటే మోసం'' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను పుస్తక రూపంలో పొందుపరిచామని, గత సంవత్సర కాలంగా హామీలు నెరవేర్చక పోగా వారు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేసామని మాట్లాడటం విరుద్ధంగా ఉందని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని జగనన్న నాయకత్వంలో ఎక్కడ ఈ కార్యక్రమాలు తలపెట్టిన వేలాది సంఖ్యలో ప్రజలు తమకు మద్దతు తెలుపుతున్నారని, కూటమి ప్రభుత్వ మోసపూరిత మాటలను ప్రజలు అర్థం చేసుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా మద్దతు తెలుపుతున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సింగరాయకొండ మండల అధ్యక్షుడు మసలం వెంకట్రావు ,చింతపల్లి హరిబాబు, టి శ్రీనివాసులు, జడ్పిటిసి ప్రధాన కార్యదర్శులు వైసిపి నాయకులు పాల్గొన్నారు.
What's Your Reaction?






