టంగుటూరు మండలం పొందూరులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి డా.స్వామి
62.39 లక్షల మంది ఫించన్ లబ్ధిదారులకు ప్రతి నెలా రూ. 2,695 కోట్లు ఇస్తున్నాం
పేదల సేవలో కూటమి ప్రభుత్వం: అధికారంలోకి రాకముందు నాలుగు వేలు పింఛన్ ఇస్తామంటే అపహాస్యం చేశారు , వారు ఇస్తామన్న పింఛన్ కొంచెం కొంచెం పెంచుతూ ఇచ్చారు తప్ప మాలాగా ఎవరికి ఇవ్వలేదు, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే అధిక పింఛన్ ఇస్తున్న రాష్ట్రంగా ఉందని మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో అన్నారు. ప్రతి నెల లబ్ధిదారులకు ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు ఇస్తున్నామని, పేద పిల్లల చదువు కోసం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తున్నామని, మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని కోరారు.
What's Your Reaction?






