సింగరాయకొండ లోని గీతం స్కూల్లో పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మరియు సైబర్ క్రైమ్ ఫై అవగాహన

Jul 22, 2025 - 07:36
Jul 22, 2025 - 12:16
 0  4

ప్రకాశం జిల్లా సింగరాయకొండ గీతం స్కూల్లో విద్యార్థులకు గుడ్ టచ్ బాడ్ టచ్ తో పాటు సైబర్ నేరాలపై సింగరాయకొండ ఎస్సై మహేంద్ర అవగాహన కల్పించారు. ప్రధానంగా ఆడపిల్లలు సమాజంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడడో  తెలియచెప్పారు.స్కూల్ నుండి ఇంటికి వెళ్లేటప్పుడు కొత్త వ్యక్తులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండిన తర్వాత  పరివక్తతకు వస్తారని ఆ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన ఆవశ్యకత ఉందన్నారు. తల్లిదండ్రులు చెప్పే జాగ్రత్తలను పెడచెవిన పెట్టకుండా ఆలకించాలన్నారు. అప్పుడే ఆడపిల్లకు భద్రత ఉంటుందని తమకు ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే పోలీసులు సంప్రదించాలని ఎస్ఐ మహేంద్ర అన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0