పాఠశాల విద్యార్థులకు పోషకకాలతో కూడిన ఆహారం
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ, గవదగట్లవారిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ సపోర్టెడ్ బై టాటా ట్రస్ట్ ప్రోగ్రాం అస్సోసియేట్ కుంచాల భాస్కరరావు పరిశీలించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు పోషక ఆహారం అందించాలని ప్రభుత్వం ఫోలిక్ ఆసిడ్ కలిగిన సన్న బియ్యం అందిస్తున్నారని, విద్యార్థులకు ఫోర్టిఫైడ్ రైస్, అయోడిన్ ఉప్పు కచ్చితంగా వాడాలని, ఫోర్టిఫైడ్ రైస్ లో సూక్ష్మ పోషకాలు ఉంటాయని, అయోడిన్ సాధారణ పెరుగుదల మరియు మానసిక అభివృద్ధికి,థైరాయిడ్ సమస్య అధికమించడానికి తోడ్పడుతుందని, పోర్టిఫైడ్ ఆయిల్ కచ్చితంగా వాడాలని,బెల్లం,రాగి జావలో ఐరన్ ఉంటుందని అది రక్తహీనతను తగ్గిస్తుందని, విటమిన్ బి12 నాడీ వ్యవస్థ పని చేయుటకు, కొత్త రక్తం ఏర్పడుటకు, శరీర శక్తి ఉత్పాదనకు సహాయపడుతుందని, పోర్టిపైడ్ ఆయిల్ విటమిన్ ఏ విటమిన్ డి వంటి సమృద్ధి పోషక విలువలతో ఉన్నందున కీళ్ల నొప్పులు, నరాల బలహీనత వంటి సమస్యలను అధిగమిస్తూ ఏ విటమిన్ రేచీకటి మరియు కంటి సమస్యలను నివారిస్తుందని, విటమిన్ డి దృఢమైన నరాల అభివృద్ధికి తోడ్పడుతుందని తెలియజేస్తూ వాటికి సంబందించిన F+ పోస్టర్లు అందజేసి నిర్వాహకులకు తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు మాట్లాడుతూ పాఠశాలలో నిత్యం మెనూ ఫాలో అవుతున్నామని విద్యార్థులకు చిక్కి,రాగి జావ, కోడిగుడ్డు అనునిత్యం రుచికరంగా వడ్డిస్తున్నారని,100% విద్యార్డులు పాఠశాలలోనే పౌష్టిక ఆహారం తీసుకుంటున్నారని,జోన్ల వారీగా మంచి మెనూ అందిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అజయ్ చౌదరి, పాఠశాల చైర్మన్ వాణి, మధ్యాహ్న భోజనం నిర్వాహకురాలు పద్మ పాల్గొన్నారు.
What's Your Reaction?






