02-10-2025 జాతిపిత విగ్రహానికి పూలమాలలువేసి పుష్పాంజలి ఘటించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి

Oct 2, 2025 - 11:07
 0  20

 మహాత్మా గాంధీజీ ఆశయ స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి చెప్పారు. జాతిపిత 156వ జయంతిని పురస్కరించుకుని గురువారం ఒంగోలు నగరంలోని గాంధీ రోడ్డులో ఉన్న విగ్రహానికి జిల్లా కలెక్టర్ శ్రీ. పి. రాజాబాబు, ఎంపీ శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్ధన రావు, సంతనూతలపాడు శాసనసభ్యులు శ్రీ.బి.ఎన్. విజయ్ కుమార్, 20 సూత్రాల అమల కమిటీ చైర్మన్ శ్రీ.లంకా దినకర్, మాల కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పి విజయ్ కుమార్, పి డి సి సి బ్యాంకు చైర్మన్ శ్రీ కామేపల్లి సీతారామయ్య, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ శ్రీ వేమూరి సూర్యనారాయణ, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. శిథిలమైన గ్రామ చావిడి భవనం స్థానంలో 40 లక్షల రూపాయల డీ.ఎం.ఎఫ్ నిధులతో నిర్మించే కొత్త భవనానికి వీరు శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీజీ చూపిన మార్గంలోనే గ్రామసీమల అభివృద్ధి,  గ్రామ స్వరాజ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కొత్తగా నిర్మించే భవనంలో ఫోటో ఎగ్జిబిషను, రీడింగ్ రూమ్ తో పాటు టాయిలెట్లు, చంటి బిడ్డలకు తల్లులు పాలిచ్చే సదుపాయాలను కల్పించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో దేశ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపేలా అహింస,  సత్య మార్గాలను ఎంచుకొని తన వ్యక్తిత్వాన్ని ఇతరులకు ఆదర్శంగా నిలిపారని గాంధీజీని కొనియాడారు. ఎంపీ మాట్లాడుతూ పరిసరాల స్వచ్ఛత గాంధీజీ ఆశయమని, అదే ఆశయ స్ఫూర్తితో దేశ, రాష్ట్రాల అభివృద్ధికి ప్రధానమంత్రి,  ముఖ్యమంత్రి అంకితభావంతో చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు పండుగ సంతోషం రెట్టింపు అయిందని వ్యాఖ్యానించారు. లంకా దినకర్ మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలకు అనుగుణగా స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలను, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టటం సంతోషమన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ నూతనంగా నిర్మించే చావిడి భవనాన్ని మూడు నెలల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ప్రస్తుతం ఉన్న గాంధీజీ విగ్రహాన్ని కూడా ఆధునీకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ను కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోకి తీసుకుని నిర్వహణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం భారత దేశానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి గాంధీజీ శాంతి దూతగా నిలిచారని కొనియాడారు. ప్రస్తుతం అదే స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందడుగు వేస్తున్నాయన్నారు.   స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా ఉత్తమ పనితీరు కనబరిచిన పదిమంది మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులను ఈ సందర్భంగా మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో కళావతి, మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఏపీ ఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ బాబు, ఇతర అధికారులు, స్థానిక ప్రముఖులు కంది రవిశంకర్, తాతా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0