పాకల మరియు ఉల్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

Jun 17, 2025 - 12:08
Jun 17, 2025 - 12:08
 0  7
పాకల మరియు ఉల్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
పాకల మరియు ఉల్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

సింగరాయకొండ మండలంలోని పాకల మరియు ఉల్లపాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు .  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు నిర్మలా కుమారి హాజరయ్యారు. మండల వ్యవసాయ అధికారి టి పూర్ణచంద్రారావు  మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకం లో భాగంగా రైతులు ఈ కేవైసీ చేయించవలసి ఉన్నదని కానీ ప్రభుత్వం వారు సమయపాలనను దృష్టిలో ఉంచుకొని  ఇతర వనరుల ద్వారా ఈ కేవైసీ నమోదు ప్రక్రియను పూర్తి చేయడం జరిగినదని, ఇంకా ఏమైనా అన్నదాత సుఖీభవ మీద  రికార్డ్స్ రాకపోయినట్లయితే సంబంధిత రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించవలసిన దిగా కోరి ఉన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం సిబ్బంది వెంకటనారాయణ పాల్గొని ప్రకృతి వ్యవసాయం గురించి వివరించడం  జరిగినది, మరియు కార్యక్రమంలో సింగరాయకొండ ఎఈవో షేక్ జహీర్ తదితరులు  పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0