మరియమ్మ కుటుంబాన్ని దత్తత తీసుకున్న ప్రకాశం జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ
సమాజంలో అట్టడుగున ఉన్న 20 శాతం పేదప్రజలకు, సంపన్నులుగా ఉన్న 10% ప్రజలు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పీ - 4. లో భాగంగా తాను కూడా పేదలకు అండగా నిలుస్తాను అంటూ ముందుకు వచ్చారు ప్రకాశం జిల్లా ఇన్ చార్జ్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ. మద్దిపాడు మండలంలోని మల్లవరం గ్రామంలోని గొల్లపాటి మరియమ్మ కుటుంబాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. గ్రామంలోని మరియమ్మ కుటుంబ సభ్యులతో శుక్రవారం సాయంత్రం ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. తన భర్త చనిపోయారని, కుమార్తె , కుమారుడు ఉన్నారని, కూలి పనులు చేసుకునే తమకు సొంత ఇల్లు కూడా లేకపోవడంతో తల్లిదండ్రుల వద్ద ఉంటున్నట్లు మరియమ్మ ఇన్ చార్జ్ కలెక్టరుకు వివరించారు. ఈ సందర్బంగా ఇన్ చార్జ్ కలెక్టర్ గోపాలకృష్ణ దూరదర్శన్ తో మాట్లాడుతూ, పేదరికంలో ఉన్న మరియమ్మ కుటుంబానికి తాను అండగా ఉంటానని తెలిపారు. మరియమ్మకు ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. మరియమ్మ కుమార్తెకు నైపుణ్య శిక్షణ అందజేస్తామని తెలిపారు. నివాస గృహం మంజూరు చేస్తామన్నారు. ఈ సందర్బంగా మరియమ్మ కుటుంబానికి నిత్యావసర వస్తువులను అందించారు.
What's Your Reaction?






