సూపర్ జీఎస్టీ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభిన జాయింట్ కలెక్టర్.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణ ఫలాల గురించి విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ర్యాలీని సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో మెప్మా పొదుపు సంఘాల మహిళలు, వివిధ వాణిజ్య సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ అద్దంకి బస్టాండ్ వరకు సాగింది.ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ, జీఎస్టీ సంస్కరణలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ...సూపర్ సేవింగ్స్ పేరుతో నెల రోజుల పాటు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందన్నారు. అందులో భాగంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతోందన్నారు. నాలుగు వారాల పాటు నాలుగు ధీమ్ లతో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు
What's Your Reaction?






