మర్రిపూడి మండలం గుండ్ల సముద్రం లో పల్లెనిద్ర కార్యక్రమంలో ప్రకాశం జిల్లా కలెక్టర్
ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం మర్రిపూడి మండలం గుండ్ల సముద్రం గ్రామంలో శుక్రవారం నాడు ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పల్లెనిద్ర కార్యక్రమం లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మండలంలో రీ సర్వే తీరును పరిశీలించారు గ్రౌండ్ ట్రూ తింగ్ సమయంలోనే ఈకేవైసీ చేయాలని అధికారులకు స్పష్టం చేశారు రైతుల సమక్షంలోనే రీ సర్వే చేయాలని మర్రిపూడి లోని యానం నరసింహ యానం గురవయ్య యానం నాగయ్య లకు సంబంధించిన భూముల రీ సర్వేలను పరిశీలించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు ఈ సందర్భంగా అధికారులు వీటి నిర్వహణ తీరును కలెక్టర్కు వివరించారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హిమవంసి జిల్లా సర్వే అధికారి గౌస్ బాషా రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0