దొనకొండ పారిశ్రామిక హబ్ భూముల వివరాలు రెండు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక, ప్రకాశం జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు
25 ఎకరాలలో దోనకొండలో పారిశ్రామిక హబ్ గా
దొనకొండ, జూన్ 10: దొనకొండలో పారిశ్రామిక అవసరాలకు అందుబాటులో ఉన్న భూముల సమగ్ర వివరాలను రెండు వారాల్లోగా ప్రభుత్వానికి నివేదిస్తామని పి. రాజాబాబు తెలిపారు. బుధవారం ఆయన జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, అద్దంకి ఆర్డీఓ విజయజ్యోతి కుమారిలతో కలిసి దొనకొండ మెగా పారిశ్రామిక హబ్‌లోని వివిధ బ్లాకులను పరిశీలించారు. ప్రభుత్వం 25 వేల ఎకరాలతో దొనకొండను మెగా పారిశ్రామిక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టిందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే BDL, APGEC, భవ్య ఇండస్ట్రీ సంస్థలు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. హబ్ పరిధిలో ప్రభుత్వ, పట్టా, అసైన్డ్, పోరంబోకు భూముల సర్వేను వేగవంతంగా పూర్తి చేసి నివేదిక సమర్పిస్తామని చెప్పారు. భూసేకరణ ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొనకొండ మండలంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసిన వారికి బిల్లులు పూర్తిగా చెల్లించామని, త్వరలో వెలుగొండ ప్రాజెక్ట్ ద్వారా నీటి సరఫరా అందించి ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వసంతరావు నాయక్, తహసీల్దార్ రమాదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0