సింగరాయకొండ లో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

May 14, 2026 - 13:41
 0  37
దేవి శ్రీ ఫుడ్ ఫ్యాక్టరీ యందు మహిళలకు చట్టాల గురించి వివరిస్తున్న సిఐ శ్రీహరి
1 / 1

దేవి శ్రీ ఫుడ్ ఫ్యాక్టరీ యందు మహిళలకు చట్టాల గురించి వివరిస్తున్న సిఐ శ్రీహరి

సింగరాయకొండలో మహిళల భద్రతపై పోలీసుల అవగాహన కార్యక్రమం సింగరాయకొండ, మే 14: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ V హర్ష వర్ధన్ IPS గారి సూచనల మేరకు, ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారి ఆదేశాల ప్రకారం, సింగరాయకొండ సీఐ శ్రీ Y శ్రీహరి గారు ఈ రోజు సింగరాయకొండలోని దేవి సీ ఫుడ్స్ ఫ్యాక్టరీలో మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, ముఖ్యంగా లైంగిక వేధింపులు, గృహహింస, వరకట్న వేధింపులు, అపహరణలు, యాసిడ్ దాడులు వంటి ఘటనలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం మహిళలపై నేరాలకు కఠిన శిక్షలు ఉన్నాయని, ప్రతి మహిళ తన హక్కులు మరియు చట్టాల గురించి తెలుసుకోవాలని తెలిపారు. అలాగే మహిళల రక్షణ కోసం పోలీసులు అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై వేధింపులను అరికట్టేందుకు శక్తీ టీమ్స్ పనిచేస్తున్నాయని, అత్యవసర పరిస్థితుల్లో మహిళలు వెంటనే 112 మరియు 100 హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని వివరించారు. పోలీసు శాఖ మహిళల భద్రతకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఎలాంటి సమస్య వచ్చినా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సీఐ శ్రీహరి గారు మహిళలకు భరోసా కల్పించారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0