మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్

Jun 14, 2026 - 14:45
 0  282

యర్రగొండపాలెం, జూన్ 14: యర్రగొండపాలెం పట్టణంలోని వై.కొత్తపల్లి సమీపంలో జాతీయ రహదారి-565పై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న కారు, బొలెరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న మాజీ మంత్రివర్యులు డాక్టర్ శ్రీ ఆదిమూలపు సురేష్ గారు క్షతగాత్రుల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టారు. అంతేకాకుండా సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తూ అధికారులు, వైద్య సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు. ప్రమాద బాధితులకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకున్న డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి సేవలను స్థానికులు అభినందించారు.

What's Your Reaction?

Like Like 4
Dislike Dislike 0
Love Love 1
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0