ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ..

Mar 28, 2026 - 10:49
 0  26
1 / 1

ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయాలి..ఎంపీడీఓ డి. జయమణి-పెండ్యాల విరాజ్ పుట్టినరోజు సందర్భంగా పాత సింగరాయకొండ పంచాయతీ పరిధి గవద గట్ల వారి పాలెం  మండల పరిషత్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల అభివృద్ధి అధికారిణి డి జయమణి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్లు మరియు ఇతర విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎంపీడీఓ జయమణి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. విద్య అనేది సమాజ అభివృద్ధికి పునాది అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమము పాఠశాల ప్రధానోపాధ్యాయులు అర్రిబోయిన రాంబాబు నిర్వహించగా, ప్రధానోపాధ్యాయులు  అంబటి బ్రహ్మయ్య, హైకోర్టు న్యాయవాది పంతగాని వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు లక్ష్యంతో చదువుకుంటే ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని వారు పేర్కొన్నారు.

పెండ్యాల విరాజ్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా కమిటీ చైర్మన్ వాణి, గ్రామ పెద్దలు మరియు స్థానికులు పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0