వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో.. కొండపి లో వైసీపీ భారీ నిరసన

Jun 12, 2026 - 08:00
 0  25

కొండేపి, జూన్ 12: మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు నిరసనగా శుక్రవారం కొండేపిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కొండేపి ఆర్టీసీ డిపో పక్కన ఉన్న పోలేరమ్మ గుడి వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఎమ్మార్వో కార్యాలయం సమీపంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు సాగింది. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని “చంద్రబాబుకు వెన్నుపోటు రెండేళ్లు” అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని పేర్కొంటూ నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీ అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0