పాత సింగరాయకొండ లో శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానమునందు పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షణ

May 31, 2026 - 05:15
 0  590

దక్షిణ సింహాచలంలో వైభవంగా గిరి ప్రదక్షిణ మహోత్సవం ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో వెలసిన దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. 31-05-2026 తేదీన జరిగిన ఈ మహోత్సవాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ సన్నెబొయిన శ్రీనివాసులు నాయుడు, ఈవో కృష్ణవేణి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. దక్షిణ మెట్ల మార్గం ఎదురుగా ఉన్న మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని “గోవింద… గోవింద…” నామస్మరణలతో, భక్తి గీతాలు, సంకీర్తనలతో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహంతో మార్మోగిపోయాయి. అలాగే చిన్నారులు సంప్రదాయ నృత్య వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. పౌర్ణమి వేళ జరిగిన ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది.

What's Your Reaction?

Like Like 5
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0