సింగరాయకొండలో పోలీసుల కార్డన్ సెర్చ్ – 15 వాహనాలు స్వాధీనం, గంజాయి & సైబర్ నేరాలపై అవగాహన
గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి, డాక్యుమెంట్లు లేని వాహనాలపై చర్యలు
సింగరాయకొండలో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు – గంజాయి, సైబర్ నేరాలపై అవగాహన
సింగరాయకొండ, జూన్ 16: ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్, ఐపీఎస్ గారి సూచనల మేరకు, ఒంగోలు డీఎస్పీ శ్రీ రాయపాటి శ్రీనివాసరావు గారి ఆదేశాల ప్రకారం సింగరాయకొండ సీఐ శ్రీ వై. శ్రీహరి ఆధ్వర్యంలో మంగళవారం సింగరాయకొండలోని కాటిపాపల కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సీఐ శ్రీ వై. శ్రీహరితో పాటు సింగరాయకొండ ఎస్‌ఐ శ్రీ ఎల్. సుధీర్ కుమార్, టంగుటూరు ఎస్‌ఐ శ్రీ వి. నాగమల్లేశ్వరరావు, జరుగుమల్లి ఎస్‌ఐ శ్రీ పీ. భాగ్యరాజ్ మరియు సుమారు 35 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
కార్డన్ సెర్చ్ సందర్భంగా వాహనాల తనిఖీలు చేపట్టగా, సరైన పత్రాలు చూపించలేని 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 12 వాహనాల పత్రాలను పరిశీలించి, నిబంధనలు పాటిస్తున్నట్లు నిర్ధారించిన తర్వాత వాటి యజమానులకు అప్పగించారు.
ఈ సందర్భంగా సీఐ శ్రీ వై. శ్రీహరి ప్రజలకు గంజాయి అక్రమ రవాణా, వినియోగం వల్ల కుటుంబాలు ఎదుర్కొనే తీవ్ర నష్టాల గురించి అవగాహన కల్పించారు. గంజాయి మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా నిరోధించేందుకు ప్రజల సహకారం అవసరమని పేర్కొన్నారు.
అలాగే రాష్ట్రంలో అధిక సంఖ్యలో మరణాలు రోడ్డు ప్రమాదాల వల్లనే సంభవిస్తున్నాయని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాల తీవ్రతను తగ్గించవచ్చని సూచించారు.
సైబర్ నేరాలపై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఫోన్ ద్వారా వచ్చే అనుమానాస్పద కాల్స్, సందేశాలను నమ్మవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు లేదా వ్యక్తిగత బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. ఏదైనా అనుమానం వచ్చిన వెంటనే స్థానిక పోలీసులను సంప్రదిస్తే సత్వర న్యాయం అందించగలమని తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా గంజాయి వ్యతిరేక ర్యాలీ కూడా నిర్వహించగా, సుమారు 60 మంది ప్రజలు పాల్గొన్నారు. గంజాయి అక్రమ రవాణా మరియు వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రజలందరూ సహకరించాలని పోలీసులు కోరారు.

What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0