కొండేపి ఐసీడీఎస్ ప్రాజెక్టు సమావేశంలో సఖి వన్ స్టాప్ సెంటర్ సేవలపై అవగాహన

Jun 16, 2026 - 13:31
 0  21

మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ కొండేపి ఐసిడిఎస్ ప్రాజెక్టు సెక్టర్ నందు పొన్నలూరు మరిపూడి కొండపి మండలాలఅంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించిన ప్రాజెక్ట్ మీటింగ్ నందు సఖి వన్ స్టాప్ సెంటర్,సెంటర్ అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి జ్యోతి సుప్రియ పాల్గొన్నారు.

ఈ సమావేశంలో శ్రీమతి జ్యోతి సుప్రియ గారు సఖి వన్ స్టాప్ సెంటర్ ద్వారా అందజేయుచున్న సర్వీసులు అయిన తాత్కాలిక ఆశ్రయము, వైద్య సహాయం, పోలీసు సహాయం, న్యాయ సహాయం, కౌన్సిలింగ్ సహాయం గురించి వివరించారు. గృహింసకు, లైంగిక దాడులకు, అత్యాచారాలకు, వరకట్నవేధింపులకు, పిల్లలపై జరుగుతున్న లైంగిక దాడులకు, అక్రమ రవాణాకు గురవుతున్న మహిళలు మరియు బాలికలకు, యాసిడ్ దాడులకు గురవుతున్న మహిళలకు, సైబర్ నేరాలకు, నిర్వాసితులైన మహిళలకు మరియు వివిధ సమస్యలు ఎదుర్కొంటున్న బాధిత మహిళలకు, వయసుతో కులముతో మతముతో మరే విధమైన తారతమ్యం లేకుండా ఓఎస్సీ ద్వారా సర్వీసుల అందించగలమని తెలియజేశారు.

బాధిత మహిళలు నేరుగా గాని లేదా 181 టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా గాని బాలికలైతే 1098 ద్వారా గాని 24 గంటల సహాయాన్ని పొందవచ్చు అని తెలియజేశారు అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో ఓఎస్సీ కేంద్రం అందుబాటులో ఉందని తెలియజేశారు ఈ సందర్భంగా ఓ ఎస్ సి  ద్వారా కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండటానికి వివాహానికి ముందే కాబోయే వధూవరులు ఏ విధంగా వారి వైవాహిక జీవితాన్ని ప్రణాళికాయుతంగా నడపవచ్చుఅనే అంశం పై సలహా ఇవ్వటం కొరకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్స్ నిర్వహింపబడుతున్నాయని తెలియజేశారు అదేవిధంగా తేదీ 15. 6.2026న శ్రీయుత ప్రిన్సిపల్ సెక్రెటరీ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, గుంటూరు వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించిన ప్రకారం ఇబ్బందుల్లో మానసిక ఒత్తిడిలో ఉన్నటువంటి ఏ ఉద్యోగి అయినా ఏ మహిళ అయినా ఆత్మహత్యల వైపు ప్రేరేపించబడకుండా ఉండటం కోసం ఒత్తిడిని తట్టుకోవడానికి వారు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించుకోవడానికి వన్ స్టాప్ సెంటర్స్ ద్వారా సహాయం పొంది ఆ ఒత్తిడి నుంచి బయటపడే విధంగా చర్యలు తీసుకోమని ఇచ్చిన సూచనలను అనుసరించి సమావేశానికి హాజరైన అంగన్వాడి కార్యకర్తలు ఏ విధమైనటువంటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వన్ స్టాప్ సెంటర్ ను సంప్రదించవచ్చని తెలియజేశారు.

 అదేవిధంగా టీనేజ్ ప్రెగ్నెన్సీలు ఎక్కువగా నమోదవుతున్నందువలన బాల్యవివాహాలు నిరోధించడంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులను నాయకులను కలుపుకొని వారిద్వారా బాల్య వివాహాలు మరియు టీనేజీ ప్రెగ్నెన్సీల ద్వారా వచ్చే నష్టాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లాలని తెలియజేశారు శ్రీమతి సుశీల గారు సిడిపిఓ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కొండేపి వారు మాట్లాడుతూ అంగన్వాడి కార్యకర్తలు క్రమంగా నిర్వర్తించే విధులతో పాటు సామాజిక బాధ్యతగా పై అంశాలలో కూడా దృష్టి సారించి అవసరమైనటువంటి బాధితులకు మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా అందుతున్న సేవలను సహాయ సహకారాలను తెలియజేసి బాధితులు లబ్ధి పొందే విధంగా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు విక్టోరియా రాణి రిజ్వాన గారు అంగన్వాడీ కార్యకర్తలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0