మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది మంత్రి స్వామి

May 20, 2026 - 04:43
 0  10

🎤 మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సింగరాయకొండలో పర్యటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకల, ఊళ్లపాలెం మత్స్యకార గ్రామాల్లో రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి స్వామికి స్థానిక మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. “మత్స్యకారుల సేవ” పథకం ద్వారా రాష్ట్రంలోని 1 లక్ష 30 వేల 796 మత్స్యకార కుటుంబాలకు రూ.262 కోట్ల లబ్ధి చేకూరిందని తెలిపారు. అలాగే మత్స్యకారులకు 60 శాతం సబ్సిడీతో మెకనైజ్డ్ బోట్లు అందజేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పొరుగు రాష్ట్రాల బోట్లు ఆంధ్రప్రదేశ్ జలాల్లో అక్రమంగా ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. జువ్వలదిన్నెలో రూ.288 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న షిప్పింగ్ హార్బర్ పనులు ఇప్పటికే 87 శాతం పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. ఈ హార్బర్ పూర్తయితే మత్స్యకారుల జీవనోపాధికి మరింత ఊతమిస్తుందని పేర్కొన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కట్టుబడి ఉన్నారని అన్నారు. మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0