*పొలాల్లోకి ఒరిగిన బస్సు.. తృటిలో తప్పిన ఘోర ప్రమాదం!"* *"60 మంది ప్రయాణికులు సురక్షితం – కొండపి సమీపంలో ఘటన"*

Jul 18, 2026 - 06:55
 0  3

కొండపి వద్ద బస్సు ప్రమాదం తప్పింది.. 60 మంది ప్రయాణికులు క్షేమం *ప్రకాశం జిల్లా, కొండపి:* కొండపి మండలంలో శనివారం ఒక బస్సు ప్రమాదం తృటిలో తప్పింది. కొండపి నుంచి మద్దులూరు మీదుగా ఒంగోలు వెళుతున్న బస్సు (AP39TF 1589) అనకర్లపూడి–మద్దులూరు మధ్య కోల్డ్ స్టోరేజ్ వద్ద రోడ్డు పక్కకు ఒరిగింది. ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇచ్చే సమయంలో రోడ్డు మార్జిన్ లేకపోవడంతో బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న పొలంలోకి ఒరిగినట్లు సమాచారం. ఆ సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు ప్రథమ చికిత్స అందించారు.

What's Your Reaction?

Like Like 1
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0