డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యం సింగరాయకొండలో ‘నషా ముక్తి అభియాన్’ అవగాహన కార్యక్రమం..
సింగరాయకొండ: డ్రగ్స్ రహిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సింగరాయకొండలో ‘నషా ముక్తి అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సింగరాయకొండలోని మలినేని లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, మలినేని సుశీలమ్మ ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్, టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకులం విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం, భవిష్యత్ జీవితంపై పడే దుష్ప్రభావాలపై బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు అవగాహన కల్పించారు.
యువత డ్రగ్స్‌తో పాటు ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని నిర్వాహకులు సూచించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సమాజంలో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు యువతను నషాముక్త్ భారత్ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే ‘నషా ముక్తి అభియాన్’ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆయా కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
What's Your Reaction?
Like
2
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
2