శీర్షిక: మర్రిపూడి మండల చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ల సమావేశంలో పాల్గొన్న HSC గ్రూప్స్ అధినేత తాటిపర్తి సుధాకర్
మర్రిపూడి ఫాస్టర్స్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న HSC group అధినేత తాడిపత్రి సుధాకర్
కొండపి, ప్రకాశం జిల్లా: కొండపి నియోజకవర్గంలోని మర్రిపూడి మండల కేంద్రంలో నిర్వహించిన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ పాస్టర్ల సమావేశానికి ముఖ్య అతిథిగా HSC గ్రూప్స్ సంస్థల అధినేత తాటిపర్తి సుధాకర్ హాజరయ్యారు. మర్రిపూడి మండల పాస్టర్ల ఆహ్వానం మేరకు సమావేశంలో పాల్గొన్న తాటిపర్తి సుధాకర్‌ను పాస్టర్ల సంఘం సభ్యులు శాలువా కప్పి, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాస్టర్లు, సంఘ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి, పలు సామాజిక, ఆధ్యాత్మిక అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. కార్యక్రమంలో మర్రిపూడి మండలానికి చెందిన పాస్టర్లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో కొండపి మండల కేంద్రంలో పలువురు ఆత్మీయ స్నేహితులతో కలిసి టీ తాగుతూ స్థానిక పరిస్థితులు, సామాజిక అంశాలపై ఆత్మీయంగా చర్చించారు.
What's Your Reaction?
Like
1
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0